మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Apr 23, 2020 , 22:25:19

జీవితానికి ఎంత అవసరమో...

జీవితానికి ఎంత అవసరమో...

ఆధ్యాత్మిక ప్రజ్ఞవేరు. సర్వసంగ పరిత్యాగం వేరు. ఆధ్యాత్మిక ప్రజ్ఞ ఉన్నంత మాత్రాన దేన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. అలా అని అన్నింటినీ అంటిపెట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. ‘తండ్రీ! సంతోషంగా పనిచేయడానికి తగిన ఆరోగ్యం, అవసరాలకు తగినంత సంపద, కష్టనష్టాలతో పోరాడగలిగేంత బలం, తప్పుల్ని మన్నించేంత క్షమాగుణం, మంచి జరిగేదాకా ఎదురుచూసేంత ఓపిక, ఇతరులకు ఉపయోగపడేంత ప్రేమగుణం ప్రసాదించు చాలు’ అని మాత్రమే ప్రార్థిస్తాడు ఆధ్యాత్మిక ప్రజ్ఞావంతుడు. అనంతమైన సిరిసంపదలో, మృత్యుభయంలేని అజరామరత్వమో ఆశించడు. తగినంత లగేజీతోనే ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అనవసరమైన బరువులు దీర్ఘకాలంలో గుదిబండలే అవుతాయి.logo