మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Apr 12, 2020 , 22:42:05

దొంగలున్నారు జాగ్రత్త!

దొంగలున్నారు జాగ్రత్త!

ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. మీకు కరోనా సమాచారం అందిస్తామని, నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని, ఫలానా మందులు వాడితే వైరస్‌ను నివారించవచ్చని, ఆన్‌లైన్‌లోనే పరీక్షలు చేయించుకోవచ్చనీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీటిద్వారా ర్యాన్సన్‌ మాల్‌వేర్‌ను మీ మొబైల్‌లోకి పంపుతారు. తర్వాత మీ బ్యాంక్‌ఖాతాలోని డబ్బును లూటీ చేస్తారు.  కొన్నిఫేక్‌ యాప్స్‌ ద్వారా మీ ఫోన్‌ను నియంత్రణలోకి తీసుకొని తమ పని కానిస్తారు.  కరోనావైరస్‌ యాప్‌, కరోనావైరస్‌ మ్యాప్‌, కరోనా లైవ్‌1.1, కరోనా వైరస్‌ ఫైండర్‌, కరోనా యాప్స్‌, కొవిడ్‌19ట్రాకర్‌... ఇవీ  అనధికారికంగా విడుదలైన యాప్స్‌. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన యాప్స్‌ను వాడటం సురక్షితం. 


logo