మంగళవారం 07 జూలై 2020
Zindagi - Apr 08, 2020 , 21:45:31

వజ్రాలు... హిజ్రాలు

వజ్రాలు...  హిజ్రాలు

కరోనా కారణంగా... యాచనే ఆధారంగా బతికే  చాలామంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉపాధిని కోల్పోయారు. అయినా, నిరాశతో కుమిలిపోకుండా.. సామాజిక బాధ్యతగా బయటికి వచ్చారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. సిగ్నల్స్‌ పడిన సమయంలో... కరోనా కట్టడికి చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో  ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రంగు చీరలు ధరించి... తమ హావభావాలతో ఆకట్టుకుంటున్నారు, ఆలోచింపజేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ రైళ్లు, బస్సులు, దేవాలయాలు, సిగ్నల్స్‌ వద్ద యాచించి సంపాదించుకున్న డబ్బును పేదల కడుపునింపడానికి వినియోగిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని ఎల్‌.బి.నగర్‌కు చెందిన వాసవిరెడ్డి అనే హిజ్రా తోటివారితో కలిసి పేదలకు  బియ్యం, కూరగాయలు అందించి తన పెద్దమనసు చాటుకుంది. ‘నా చుట్టూ ఉన్నవారు బాగుంటేనే నేను బాగుంటాను. వారు ఆకలితో అలమటిస్తుంటే నేనెలా కడుపునిండా తినగలను? అందుకే నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను’ అంటున్నారామె. ఇక కడప జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్స్‌ హాసిని అసోసియేషన్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వెజ్‌బిర్యానీ, ఎగ్‌కర్రీ నిరుపేదలకు పంపిణీ చేశారు. 


logo