సోమవారం 25 మే 2020
Zindagi - Apr 07, 2020 , 22:22:36

కటౌట్లే అతిథులుగా!

కటౌట్లే అతిథులుగా!

కరోనా వైరస్‌... కటౌట్ల మధ్యన ఓ పెండ్లి చేయించింది. విచిత్రంగా ఉంది కదూ? మిచిగాన్‌కు చెందిన డాన్‌ స్టుగ్లిక్‌, అమీ సైమన్సన్‌ ప్రేమ జంట మార్చి 31న పెండ్లికి ఏర్పాట్లు చేసుకుంది.  160 మందిని శుభకార్యానికి ఆహ్వానించారు. అందరి సమక్షంలో ఘనంగా ఒక్కటి కావాలన్నది వారి ఆశ.  కానీ కరోనా ఆ కలలకు ఆటంకం కలిగించింది. సామాజిక దూరం పాటించాలంటూ అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో... ఏ ఒక్కరూ బయటకు రాలేని పరిస్థితి. వధూవరులు ఈ పరిస్థితిని ఊహించలేదు. అప్పటికే ఆలస్యం అయింది. శుభకార్యాన్ని  వాయిదా వేసుకోలేని  అనివార్యత. మొత్తానికి తంతు పూర్తయింది. అతిథులెవరో తెలుసా? కార్డ్‌బోర్డ్‌ కటౌట్లు! అవును.. తాము ఆహ్వానం పంపిన 160 మందిని పోలిన కటౌట్లు తయారుచేయించి& అవే అతిథులుగా వివాహం చేసుకున్నారు. ‘పరిస్థితులకు తగ్గట్టుగా మనమూ మారాలని నిర్ణయించుకున్నాం. అవి కటౌట్లు కాదు.. మా అతిథుల ప్రతిరూపాలని భావించాం’ అన్నారు వధూవరులు. 
logo