సోమవారం 25 మే 2020
Zindagi - Apr 05, 2020 , 23:26:30

అండగా ఐటీ కమిషనర్‌

అండగా ఐటీ కమిషనర్‌

ప్రస్తుత సంక్షోభ సమయంలో.. ముంబైకి చెందిన ఐటీ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ మేఘా భార్గవ్‌ 66 కుటుంబాల బాధ్యతను తీసుకొన్నారు. ముంబైలోని కోరేగావ్‌లో రోజువారీ వేతనాలపై బతికే అరవై ఆరు కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నాయి. ఈ విషయం డాక్టర్‌ మేఘా భార్గవ్‌కు తెలిసింది. వెంటనే ఆమె సమర్పణ్‌ అనే ఎన్జీవో ద్వారా నిధుల సేకరణ ప్రారంభించింది. తన సోదరి డాక్టర్‌ రుమాతో కలిసి ఈ సేవకు పూనుకుంది. ఇద్దరూ కలిసి పేదల కోసం కొన్ని కిట్లు తయారు చేశారు. ప్రతి కిట్‌లో వెయ్యిరూపాయల విలువైన సరుకులు పెట్టారు. ఇప్పటికి 750 మందికి పైగా ఈ కిట్లను అందచేశారు. 10,000 కుటుంబాలకు చేరాలన్నది లక్ష్యం. దీనికి ముంబై పోలీసులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యులు, వైద్య నిపుణులు సహకారం అందిస్తున్నారు. పంపిణీ ప్రక్రియకు ఆటంకం కలుగకుండా ముంబై పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. ముంబై పోలీసుకులకు 800 బాటిళ్ల శానిటైజర్లను, గుజరాత్‌ పోలీసులకు 1300 బాటిళ్ల శానిటైజర్లను అందచేయగలిగింది మేఘాభార్గవ్‌. ఆమెతో కలిసి పనిచేయడానికి ముంబైలోని కొన్ని కాలనీవాసులు ముందుకు రావడంతో ఆ పని మరింత సులువైంది. 


logo