సోమవారం 25 మే 2020
Zindagi - Apr 05, 2020 , 23:25:57

బ్యాడ్మింటన్‌ శిక్షణ @ ఆన్‌ లైన్‌

బ్యాడ్మింటన్‌ శిక్షణ @ ఆన్‌ లైన్‌

కరోనా మహమ్మారి కారణంగా క్రీడాలోకం వెలవెలబోతున్నది. ఏకంగా ఒలింపిక్స్‌ను సైతం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో క్రీడాకారులంతా మెరుగైన శిక్షణ కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఫిట్‌నెస్‌ కోసం... చీఫ్‌  కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఓ మంచి ఆలోచన చేశారు. అదే.. ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని అంటున్నారు గోపీచంద్‌. మన దేశంలో అగ్రశ్రేణి షట్లర్ల కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నారు గోపీచంద్‌. ఆటకు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలు ఆ గ్రూపులో పంచుకుంటున్నారు. వీరికి ప్రముఖ ఫిట్‌నెస్‌ కోచ్‌ దినాజ్‌ వెర్వత్వాలా జత కలిశారు. ఈమె కూడా జూమ్‌ యాప్‌ ద్వారా  క్లాసులు తీసుకుంటున్నారు. ‘ప్రస్తుతం కోర్టుల్లో ఎవ్వరికీ ప్రవేశం లేని కారణంగా ఇలా ఆన్‌ లైన్‌ శిక్షణ ఇస్తున్నాం. ఇలాగైనా మేం చేయగలిగింది చేస్తున్నాం. ఇది సాధారణమైన కార్యక్రమమే అయినా.. క్రీడాకారులు ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది’ అని గోపీచంద్‌ అంటున్నారు. 


logo