మంగళవారం 02 జూన్ 2020
Zindagi - Apr 05, 2020 , 23:25:05

అమ్మచేతి మసాజ్‌!

అమ్మచేతి మసాజ్‌!

ప్రతీ సెలెబ్రిటీ ఇప్పుడు మామూలు జీవితాన్ని గడుపుతున్నారు.  కంగనా రనౌత్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో తన కుటుంబంతో గడపడానికి వెళ్లింది. కంగనాకి ఆమె తల్లి నూనె పెడుతూ మసాజ్‌ చేస్తున్న ఫొటో బాగా వైరల్‌ అవుతున్నది. తమ బాల్య స్మృతులు గుర్తుకువస్తున్నాయని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆమె చేతిలో ఉన్న నూనె గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. జవాబుగా కంగనా.. ‘దాని పేరు చులీ ఆయిల్‌' అని పోస్ట్‌ పెట్టింది. ఇప్పుడు ఈ చులీ నూనె గురించే చాలామంది సెర్చ్‌ చేస్తున్నారట. ఈ తైలానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది జుట్టు మందంగా, ఏపుగా పెరగడానికి సహాయపడుతుంది. స్థానికంగా దొరికే చులీ పండ్లతో దీన్ని తయారు చేస్తారు. లడఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి ప్రాంతాలలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. 


logo