శనివారం 11 జూలై 2020
Zindagi - Apr 04, 2020 , 22:22:19

రెడ్‌ జోన్‌ ఎందుకు?

రెడ్‌ జోన్‌ ఎందుకు?

కరోనా వైరస్‌ గాలి ద్వారా రాదు కదా! మరి కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న అందరినీ రెడ్‌ జోన్‌లో ఎందుకు ఉంచుతారు?

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదు. కాని కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని ముట్టుకుంటే వస్తుంది. చాలామందికి కొవిడ్‌-19 ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. కానీ ఈలోపే వారి ద్వారా ఇన్‌ఫెక్షన్‌ ఇతరులకు వ్యాపించవచ్చు. ఒక కాలనీలో ఉన్నవాళ్లు అందరూ ఒకరికొకరు సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఎక్కువ. ఇంటి దగ్గరే కలిసి వాకింగ్‌ చేయొచ్చు. లేదా వీధి అవతల ఉన్న ఏ కిరాణా దుకాణానికో వెళ్లొచ్చు. మెడికల్‌ షాప్‌కి వెళ్లొచ్చు. కూరగాయలు కొనొచ్చు. ఎవరో ఒక వ్యక్తి మరొకరికి వ్యాపింపచేసినా సమస్యే. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ఇంట్లో పనిమనిషి అయినా వేరే ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ద్వారా ఆ ఇంట్లో వాళ్లకు, అక్కడి నుంచి మరొకళ్లకు.. ఇలా వెళ్తూనే ఉంటుంది. అందుకే ఎపిడెమాలజిస్టులు ఆ వ్యక్తి చుట్టూ 3 కిలోమీటర్ల మేర దూరం పాటించాలని చెప్తారు. ఆయా కాలనీల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించడం కోసం ఇది తప్పనిసరి. 


డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo