గురువారం 02 జూలై 2020
Zindagi - Apr 04, 2020 , 22:19:13

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

వంటింటి శుభ్రత పట్ల చిన్నపాటి నిర్లక్ష్యమే అనారోగ్యానికి దారి తీస్తుంది. అందుకని, ఈ చిట్కాలు పాటిస్తే  వంటగది శుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

  • వంటగదిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేయడానికి అందుబాటులో స్పాంజ్‌ లేదా టవల్‌ను ఉంచుకోవాలి.  
  • తరచూ అవసరమయ్యే పాత్రలను చేతికందేలా పెట్టుకోవాలి.  
  • ఏ డబ్బాలో ఏమున్నాయో చూడగానే తెలిసేలా లేబుల్‌ రాసి అంటిస్తే, త్వరగా గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇలా చేస్తే వంటపని త్వరగా అయిపోతుంది.
  • పొడి  పదార్థాలను (ఉప్పు, కారం) ఫ్రిజ్‌లో పెట్టవద్దు.


logo