గురువారం 04 జూన్ 2020
Zindagi - Apr 01, 2020 , 21:07:33

లవ్‌ 2020

లవ్‌ 2020

కరోనా కాలంలో ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిందో వృద్ధ జంట. 85 ఏండ్ల ఇంగా రాస్ముసేన్‌  డెన్మార్క్‌లో నివసిస్తున్నారు. అతని భార్య హాన్సెన్‌ జర్మనీ మహిళ. వైరస్‌ వ్యాప్తి కారణంగా డానిష్‌-జర్మన్‌ సరిహద్దులు రెండు వారాల క్రితం మూసేశారు. కానీ ఆ జంట కలవకుండా ఉండలేకపోయింది. ఇప్పటికీ కలుస్తూనే ఉన్నారు. సరిహద్దు ప్రాంతమైన వెంటాఫ్‌ పట్టణానికి సమీపంలో వీళ్లు నిత్యం కలుసుకుంటున్నారు. సరిహద్దు మూసివేయడానికి ఉపయోగించిన చిన్నపాటి డివైడర్‌కు అవతలివైపు ఆమె, ఇవతలివైపు అతను కూర్చుని మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు పానీయం కూడా పంచుకుంటారు. ఈ ప్రేమకథ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నది.కరోనా వచ్చినా, సరిహద్దులు మూసినా... ప్రేమకు అడ్డం కాదని పలువురు మెచ్చుకుంటున్నారు. జిందాబాద్‌లు కొడుతున్నారు.


logo