హైదరాబాద్ : టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో సీనియర్ నిర్మాత కన్నుమూశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు. ఈయన వయసు 81 సంవత్సరాలు.
కొన్ని రోజులుగా రాఘవేంద్రరావు సోదరుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఉన్నట్లుండి పరిస్థితి విషమించడంతో మార్చి 24న ఈయన మరణించారు. ఫిలిం నగర్లోని తన స్వగృహంలోనే ఈయన మృతి చెందారు.
కృష్ణమోహన్రావుకు ఇద్దరు కుమార్తెలు. ఈయన నిర్మించిన సినిమాల్లో చాలా వరకు విజయాలు ఉన్నాయి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు.
వాళ్లలో ఒకరు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ కావడం గమనార్హం. మరో కుమార్తె పేరు లత.
మార్చి 25న ఫిలింనగర్ మహాప్రస్థానంలో రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి.
కృష్ణమోహన్ రావు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్లో కొన్ని సినిమాలు నిర్మించాడు కృష్ణమోహన్ రావు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి