బుధవారం 03 జూన్ 2020
Zindagi - Mar 31, 2020 , 22:13:47

జాన్వీకపూర్‌... ఐసొలేషన్‌ లేఖ

జాన్వీకపూర్‌... ఐసొలేషన్‌ లేఖ

కరోనాకు ఎవరూ అతీతులు కారు. శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌కి కూడా ఈ ఐసొలేషన్‌ ఒక విలువైన పాఠాన్ని నేర్పిందట. ఆ వివరాలతో ఒక లేఖ కూడా రాసింది.  

‘ఒంటరితనం ఆత్మపరిశీలనకు  అవకాశం ఇస్తుంది. దేవుడి దయవల్ల నాకు డబ్బుకు కొదవ లేదు. ఇంట్లో సరుకులు సమృద్ధిగానే ఉన్నాయి. అయినా ఎక్కడో భయం. ఆకలి మహా భయంకరమైంది. ఇన్ని రోజులు నేను.. అన్నం విషయంలో ఎంత 

బాధ్యత లేకుండా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతున్నది. ఈ కొద్దిరోజుల్లో నాన్నకు, చెల్లికి మరింత దగ్గర అయినట్టు అనిపిస్తున్నది. ముఖ్యంగా  నాన్న ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఇప్పడు తనకు మేం తప్ప ఎవరున్నారు?’ అంటూ ఎమోషనల్‌గా తన మనసులోని భావాలను రాసుకొచ్చింది. 


logo