బుధవారం 03 జూన్ 2020
Zindagi - Mar 31, 2020 , 22:11:39

భయం వద్దు అప్రమత్తత చాలు

భయం వద్దు అప్రమత్తత చాలు

డాక్టర్‌ మనోజ్‌ గోయల్‌ ప్రస్తుతం ఢిల్లీలోని ఫోర్టిస్‌ మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అత్యవసర విధులు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌-19 సోకిన ఆరుగురికి వైద్యం చేశారు. అందులో ముగ్గురు డిశ్చార్జ్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ‘వ్యాధి గురించి భయపడాల్సిన పని లేదు కానీ, చాలా అప్రమత్తంగా ఉండాలి. తరచూ రోగులు దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బంది తదితర సమస్యలతో వస్తున్నారు. మేం రక్త పరీక్ష చేసి అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నాం. పాజిటివ్‌ వస్తే... వైద్య పరీక్షలు అందిస్తున్నాం. రోగ నిర్ధారణ అయిన తర్వాత రోగి కచ్చితంగా ఐసొలేషన్‌లోఉండాలి. 

అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఉంటుంది. వైద్యులు పూర్తిగా బాడీ గేర్‌ను ధరిస్తారు. ఇది వ్యోమగాములు వేసుకొనే స్పేస్‌ సూట్‌లా పని చేస్తుంది. లోపలికి గాలి కూడా చేరదు. ఒకసారి ధరించాక, ఎనిమిది గంటల పాటు దాంట్లోనే ఉండాలి. ఏమీ తినలేరు, తాగలేరు. వాష్‌రూంకు కూడా వెళ్లలేరు. డ్యూటీ ముగిసే వరకూ ధరించాల్సిందే, భరించాల్సిందే. ఐసోలేషన్‌ చికిత్స తీసుకున్న వ్యక్తికి పూర్తిగా నయం అయ్యాక... 14 రోజులు క్వారెంటైన్‌ ఉంటుంది. ఆతర్వాత మళ్లీ 14 రోజులు ప్రత్యేక పరిశీలన ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వైద్యులుగా మేం సిద్ధంగా ఉన్నాం. ప్రజలూ సిద్ధంగా ఉండాలి’ అంటారు డాక్టర్‌ మనోజ్‌. 


logo