శుక్రవారం 03 జూలై 2020
Zindagi - Mar 30, 2020 , 09:30:09

ఎవరి మాటలనూ గుడ్డిగా నమ్మవద్దు.

ఎవరి మాటలనూ గుడ్డిగా నమ్మవద్దు.

ఓ అడవిలో ఒక చెట్టుకింద నెమలి, పాము నివాసముండేవి. ఆ రెండింటికీ మంచి స్నేహం ఉండేది.  ఒక రోజు ఓ ముంగిస  పాము మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు పాము తనను రక్షించాలని నెమలిని కోరింది. వెంటనే నెమలి వచ్చి ముంగిసను ముక్కుతో పొడిచింది.  అప్పుడు ఆ ముంగిస పామును వదిలేసి పారిపోయింది.  మరో రోజు పాము, నెమలి ఓ చెట్టుకింద మాట్లాడుకుంటున్నాయి.అంతలో, ఓ వేటగాడు వచ్చి నెమలి మీద వలవేయబోయాడు. దాన్ని పాము గమనించింది.  వెంటనే వెళ్లి వేటగాడి కాలిపై కాటేసింది. అనేక సందర్భాల్లో ఇలా ఒకదాన్ని ఒకటి రక్షించుకున్నాయి. మరో వైపు ఓ తోడేలు ఎప్పటి నుంచో నెమలిని తినాలని చూస్తున్నది. కానీ పాము, నెమలి కలిసి ఉంటే తన కల నెరవేరడం కష్టం అనుకుంది. రెండింటినీ విడగొడితే తాను అనుకున్న పని అవుతుందన్న నిర్ణయానికొచ్చి, గొడవ పెట్టాలనుకుంది. ఓరోజు తోడేలు, ఒంటరిగా ఉన్న నెమలి దగ్గరకు వెళ్లి..  ‘పాము నిన్ను తినాలని చూస్తున్నది’ అని అబద్ధం చెప్పింది. మరోసారి ఒంటరిగా ఉన్న పాము దగ్గరకు వెళ్లి ‘నెమలి నిన్ను తినాలని చూస్తున్నది’ అని చెవిలో వేసింది. ఇలా గొడవపెట్టి రెండింటినీ దూరం చేయాలనుకుంది.కానీ తోడేలు పథకాన్ని ముందే ఊహించిన పాము, నెమలి.. ఆ మాటలను నమ్మలేదు.  సమయం చూసి బుద్ది చెప్పాలనుకున్నాయి.  రెండూ కలిసి వెళ్లి తోడేలు మీద దాడి చేశాయి.  ఆ దెబ్బలు భరించలేక తోడేలు కుయ్యో మొర్రో అంటూ పారిపోయింది.

నీతి

ఎవరి మాటలనూ గుడ్డిగా నమ్మవద్దు. 


logo