ఆదివారం 24 మే 2020
Zindagi - Mar 26, 2020 , 22:27:06

ప్రాణశక్తి కోసం...

ప్రాణశక్తి కోసం...

కరోనా బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ... 1. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేసుకోవాలి.  2. దీని కోసం ముఖ్యంగా    (నాడీశుద్ధి ) ప్రాణాయామ సాధన చేయాలి.  3. ఇది సవ్యంగా సాగాలంటే  సూర్య నమస్కారాలతో  పాటు  కొన్ని రకాల ఆసనాలు నిత్యం సాధన చేయాలి.  ఉదయం  (10 గం . లోపు) వీటిని సాధన చేస్తే ఫలితం బాగుంటుంది. ఖాళీ కడుపుతోనే సాధన చేయాలి.


ఎలా చేయాలంటే...... 

  • వజ్రాసనం /సుఖాసనంలో  కూర్చోవాలి. 
  • వీపు, మెడ, తల  నిటారుగా ఉండాలి. 
  • కుడి ముక్కును  కుడిచేతి బొటన  వేలుతో మూసి,  ఎడమ ముక్కు ద్వారా నిదానంగా,  నిండుగా గాలి పీల్చుకోవాలి. 
  • ఇప్పుడు ఎడమ ముక్కును   కుడిచేతి చిటికెన  వేలుతో మూసి , కుడి  ముక్కు ద్వారా నిదానంగా  బయటకు వదలాలి. 
  • తిరిగి కుడి ముక్కు నుంచి నిదానంగా గాలి పీల్చుకొని ఎడమ ముక్కు ద్వారా నిదానంగా వదలాలి. 
  • గాలి పీల్చుకుంటున్నప్పుడు మన శరీరంలోకి  ఒక శక్తి  ప్రవేశిస్తున్నదనీ,   గాలిని బయటకు వదిలే టప్పుడు  మనలోని వ్యర్థాలు బయటకు పోతున్నాయనీ మనసులో భావించాలి. ఇలా ఓపికున్నంత సేపు చేయవచ్చు. 


logo