ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 23, 2020 , 22:36:12

భవిక...సొంత సబ్బులు

భవిక...సొంత సబ్బులు

మార్కెట్‌లో కెమికల్‌ సబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా చాలామంది ఆర్గానిక్‌ సోప్‌లను వాడటం మొదలు పెట్టారు. కానీ వీటి ధర ఎక్కువ. దీంతో చెన్నయ్‌కి చెందిన 23 ఏండ్ల భవిక తానే ఆర్గానిక్‌ సబ్బులను తయారు చేసుకోవాలనుకున్నది. రెండేండ్ల క్రితం కొంత అధ్యయనం చేసి కొన్ని సబ్బులు తయారు చేసింది. వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఫ్రెండ్స్‌ నుంచి ఆర్డర్లు వచ్చాయి. దీంతో ‘షాప్‌ సోప్‌' పేరుతో మరిన్ని సబ్బులు తయారు చేసి, చిన్న వ్యాపారం ప్రారంభించింది. కలబంద, అరటిపండు, నారింజ, నిమ్మ, పొప్పడి, స్ట్రాబెరీతో పాటు పదిహేను రకాల ఫ్లేవర్లతో ఈ సబ్బులను తయారుచేస్తున్నది.  ప్రస్తుతం భవిక మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదువుతున్నది. తన చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 

ఈ వ్యాపారం చేస్తున్నది. మార్కెట్‌లో ని ఆర్గానిక్‌ సబ్బుల ధరలకంటే తక్కువ ధరలో భవిక సబ్బులను అందిస్తున్నది. the_soap.shop భవిక ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ. logo