ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 23, 2020 , 22:35:30

‘దుర్గ ఇండియా’

‘దుర్గ ఇండియా’

తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి కొద్దిమంది మహిళలు మాత్రమే బయటకు వస్తున్నారు. ఎంతోమంది లోలోపలే కుమిలిపోతుంటారు. అటువంటి వారికి అవగాహన కల్పించేందుకు ఓ మహిళ శ్రీకారం చుట్టింది. 

చాలామంది మహిళలు లైంగిక వేధింపుల గురించీ  వివక్ష గురించీ ఎవరితోనూ తమ భావాల్ని పంచుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ప్రియా వరదరాజన్‌ గ్రహించింది. అటువంటి వారిని చైతన్య పరిచి , బాధితులకు అండగా నిలవాలనుకున్నది. అందుకోసం ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన మరుసటి రోజునే... ‘దుర్గ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా మహిళల హక్కులూ, విధులపై అవగాహన కల్పించేందుకు ‘బీ టుగెదర్‌ బెంగళూర్‌' అనే వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే జంకే ప్రాంతాలను ఎంపిక చేసి, వారిలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ప్రియ ఆయా ప్రదేశాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మహిళలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నది. ప్రియా వరదరాజన్‌ చేస్తున్న ప్రచారానికి తన వంతు సాయం అందించేందుకు విశ్రాంత పోలీసు అధికారిణి ఇషాపంత్‌ ముందుకు వచ్చింది. వీరిద్దరూ ఆపదలో ఉన్న అబలలను ఆదుకొనేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులోభాగంగా చిరు వ్యాపారులకు  ఆత్మరక్షణలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.   


logo