ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 23, 2020 , 22:34:44

ఫోన్‌ చేస్తే సాయమందిస్తాం

ఫోన్‌ చేస్తే సాయమందిస్తాం

కరోనా వ్యాప్తి  నేపథ్యంలో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రెక్కాడితే గాని డొక్కాడని కొన్ని కుటుంబాలకైనా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు సినీనటులు జీవిత, రాజశేఖర్‌.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు షూటింగులు ఆపేయాలని నిర్ణయించింది కేంద్రం. రోజువారీ షూటింగ్‌లకు వెళ్తేగానీ పూటగడవని స్థితిలో ఉన్న కళాకారుల కోసం పది రోజులకు సరిపడా సరుకులు అందించాలనుకున్నారు రాజశేఖర్‌, జీవిత. షూటింగ్‌లు నిలిచిన కారణంగా పేద నటీనటులు 9010810140 నంబర్‌లో పూర్తి వివరాలు అందిస్తే రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సరుకులు అందిస్తామని ప్రకటించారు.logo