శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 23, 2020 , 22:31:21

ఫ్రీగా చూడండి

ఫ్రీగా చూడండి

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో జనాలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఇంట్లో ఉంటూ టీవీలు, సెల్‌ఫోన్‌లతో గడిపేస్తున్నారు. అయితే కొన్ని యాప్స్‌ ఎప్పటినుంచో సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) ప్లాట్‌ఫామ్‌ ‘ఈరోస్‌ నౌ’ దేశ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్‌లో నచ్చిన వీడియోలను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఈ నెలాఖరులోగా సబ్‌స్ర్కైబ్‌ చేసుకున్నవాళ్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ టైంలో ‘STAY FREE’ అని కోడ్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో హిందీ, పంజాబీ, తమిళ్‌, తెలుగు, మరాఠీ, మలయాళం, భోజ్‌పురి, గుజరాతీ, బెంగాళీ, కన్నడ భాషల్లో సినిమాలు, రియాలిటీ షోలను ఉచితంగా చూడొచ్చు.


logo