ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 22, 2020 , 22:55:04

అచ్చం ఐశ్వర్యారాయ్‌లా..

అచ్చం ఐశ్వర్యారాయ్‌లా..

అందానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఐశ్వర్యారాయ్‌. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అందం విషయంలో ఐశ్వర్యారాయ్‌నే ఉదాహరణగా తీసుకుంటారు. అచ్చు అలాంటి పోలికలతోనే మరో అమ్మాయి ఉంది. ఐశ్వర్యారాయ్‌లాంటి కళ్లు, ముక్కు, ఎత్తు ఆమెని చూసిన అనుభూతే కలుగుతుంది. ఆమె ఎవరో కాదు. మరాఠీ నటి మానసీ నాయక్‌. ఈమె టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐశ్వర్యారాయ్‌ సినిమాలోని పాటలకు టిక్‌టాక్‌ చేసి ఆ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నది. ఆ వీడియోలు చూసిన చాలామంది ‘అరే అచ్చం ఐశ్వర్యారాయ్‌లా ఉన్నావే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘manasinaik0302’ మానసీ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ. ఆమెకు 9,43,537 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. మానసీ టార్గెట్‌, కుటుంబ్‌, టీన్‌ బేకా ఫాజిటి ఐకా వంటి మరాఠీ చిత్రాలలో నటించింది కూడా. logo