ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 22, 2020 , 22:54:11

పెయింట్‌ వేయిస్తున్నారా?

పెయింట్‌ వేయిస్తున్నారా?

ఉన్నపళంగా ఇంటికి పెయింటింగ్‌ వేయాల్సి వచ్చినప్పుడు గాబరా పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో తెలుసా?

ఏ గదిలో అయితే పెయింట్‌ వేయాలో అక్కడ ఫర్నీచర్‌ కదపలేకుంటే వాటిని కవర్‌తో కప్పేయాలి. న్యూస్‌ పేపర్స్‌తో ఫ్లోర్‌ను కవర్‌ చేయాలి. స్విచ్‌ బోర్డులపై పెయింట్‌ పడకుండా జాగ్రత్తపడాలి.

పెయింట్‌ కొనేటప్పుడు ఆ రంగు రాత్రివేళ, పగటిపూట ఎలా కనిపిస్తుందో చూడాలి. ఫర్నీచర్‌కు మ్యాచ్‌ అయ్యే రంగును ఎంచుకోవాలి. కొన్ని రంగులు చూసేందుకు బాగున్నా గోడకు బాగుండదు. 

హై గ్లోస్‌ పెయింటింగ్‌ ఫినిషింగ్‌ మన్నికైంది. దీనిని శుభ్రం చేయడం సులభం. కానీ గోడలోని లోపాలను హైలెట్‌ చేస్తుంది. అదే ఫ్లాట్‌ పెయింట్‌ లోపాలను దాచిపెడుతుంది. 

ఎంత పెయింట్‌ అవసరమవుతుందో నిర్ణయించుకోవాలి. గోడలకు ప్రైమింగ్‌ చేసుంటే ఒకసారి పెయింట్‌ సరిపోతుంది. గోడలు ప్రైమ్‌ చేయకపోతే రెండుసార్లు కోటింగ్‌ అవసరం.

బ్రష్‌ గుర్తులను చదును చేయడానికి రోలర్‌ ఉపయోగించాలి. 


logo