ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 21, 2020 , 22:34:39

ఇంట్లోనే ఈ పనులు చేద్దాం

ఇంట్లోనే ఈ పనులు చేద్దాం

ఇంట్లోనే దర్జాగా కూర్చొని దేశాన్ని రక్షించే ఏకైక అవకాశం జనతా కర్ఫ్యూ. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యేవారు ఈ పనులు చేసుకోవచ్చు. శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరమవుతాయి. క్లీనింగ్‌ ముగిసిన తర్వాత బోర్‌ కొట్టకుండా ఇంకొన్ని చిట్కాలు. 


  •  ఇంట్లోని టీవీని, రిమోట్‌ను, లైటర్‌ను, డోర్‌హ్యాండిల్స్‌, బైక్‌ కీస్‌, వాచ్‌స్ట్రిప్స్‌,  తాళం చేతులు, ఫ్రిజ్‌, బీరువా హ్యాండిల్స్‌ను డెటాల్‌ కలిపిన నీటితో శుభ్రం చేయండి.
  •  ఇల్లంతా సర్ది, బూజు దులిపేసి నేలను శుభ్రంగా కడుక్కోవచ్చు. 
  •  మీ స్కూటీ హ్యాండిల్స్‌, మిర్రర్స్‌ నీట్‌గా తుడుచుకోండి. ఫోన్‌ స్క్రీన్‌ను క్లీన్‌గా ఉంచుకోండి.
  •   ఇంటిల్లిపాదీ కలిసి భోజనం చేయండి.(ఇంట్లో వండింది మాత్రమే).
  •  ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేయవచ్చు... పాత మెయిల్స్‌ డిలీట్‌ చేసుకోవడం వగైరా.
  •  కుటుంబీకులంతా ఒక చోట చేరి సినిమా చూడటం ద్వారా కాలక్షేపం పొందొచ్చు.
  •  పాత ఫొటోలు, పెండ్లి సీడీలు చూస్తూ పాతజ్ఞాపకాల్ని నెమరు వేసుకోవచ్చు.
  •  అందరూ కలిసి సరదాగా అంత్యాక్షరి ఆడండి.
  •  వీడియోగేమ్స్‌, మొబైల్‌ గేమ్స్‌ కాకుండా.. పాత ఆటలు ఆడుకోండి.
  •  పిల్లలు చెస్‌, క్యారంబోర్డు ఆట ద్వారా కూడా సమయం గడపొచ్చు.


logo