శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 21, 2020 , 22:28:09

వయసు ఓ లెక్కా?

వయసు ఓ లెక్కా?

 డబ్బుయేండ్ల వయసులో ఏం చేస్తారు? ఇంటిపట్టునుండి విశ్రాంతి తీసుకుంటారు అవునా? కానీ కెనడాకు చెందిన జాన్‌ మెక్‌డొనాల్డ్స్‌ మాత్రం ఫిట్‌నెస్‌ మంత్రంతో సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు మూడేండ్ల క్రితం శారీరక సమస్యలు వచ్చాయి. అధిక బరువు, అధిక రక్తపోటు, యాసిడ్‌ రిఫ్లక్స్‌తో బాధపడేది. ఈ సమస్యలను జయించాలనుకున్నది. డాక్టర్ల సూచన మేరకు ఫిట్‌నెస్‌ మీద దృష్టి సారించింది. వ్యాయామం చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే జిమ్‌కు హాజరైంది. మూడేండ్లలో 22 కేజీల బరువు తగ్గింది. ఆరోగ్యకరమైన శరీరాన్ని సొంతం చేసుకుంది. logo