శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 20, 2020 , 22:24:48

కత్రినా స్టయిలే వేరు

కత్రినా స్టయిలే వేరు

మల్లీశ్వరి సినిమా ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో స్థిరస్థానం సంపాదించుకున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ట్రెండ్‌ను సెట్‌ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా ఓ ఖరీదైన డ్రెస్‌తో అందర్నీ అబ్బురపరిచింది.

 బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినాకైఫ్‌కు అందమైన కాస్ట్యూమ్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే అందమైన డ్రెస్‌ కనిపిస్తే చాలు ధర ఎంతైనా కొనడానికి మాత్రం వెనుకాడదు. తాజాగా ఓ డ్రెస్‌ కత్రినాకు తెగ నచ్చిందట. దాని ఖరీదు అక్షరాలా రూ.2.2 లక్షలు. అయినా కొనేసింది. వెంటనే ఆ డ్రెస్సు వేసుకొని ఫొటోలు దిగేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఆ ఫొటోలు చూసి కత్రినా అందాన్నీ, ఆ డ్రస్సునీ నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ ఇమేజ్‌ కోసమే కత్రినా ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుందనీ, దాని కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడదని బాలీవుడ్‌ జనాలంటున్నారు. ‘ఒక డ్రెస్సుకే అంత ఖర్చు చేస్తే.. మిగతా కాస్ట్యూమ్స్‌కి ఎంత ఖర్చు చేస్తుందో’ అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.


logo