ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 20, 2020 , 22:23:29

పరుపులు, సోఫాల కోసం

పరుపులు, సోఫాల కోసం

ఇల్లు శుభ్రం చేయడానికి చీపుర్లు, వాక్యూమ్‌ క్లీనర్‌లు ఉన్నాయి. మరి పరుపులు, సోఫాలు ఎలా శుభ్రం చేయాలి?

బెడ్‌షీట్లు, పిల్లోషీట్లు, సోఫా షీట్లు, కర్టెన్లు అన్నింటినీ ఉతికి ఆరేస్తాం. మరి బెడ్‌, సోఫా, తలగడల పరిస్థితి ఏంటి? వాటిని ఉతికేది లేదా? ఉతికితే మళ్లీ పనికిరావు అనుకుంటున్నారా? అలా అని వాటిని ఏండ్లపాటు వాడితే చర్మ సమస్యలు వస్తాయి. అందుకే నీటిలో నానబెట్టి, సబ్బుతో ఉతకకుండా డిబియా కంపెనీ రోలర్‌ బ్రెష్‌తో బెడ్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ను విడుదల చేసింది. 20 సెం.మీ.  పొడవైన యువి లైట్‌ దుమ్మును తొలగిస్తుంది. దీంతో పిల్లల బొమ్మలను కూడా శుభ్రపరుచుకోవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 6,057 వరకు ఉంది.


logo