ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 20, 2020 , 23:38:19

‘డించాక్‌' కరోనా

‘డించాక్‌' కరోనా

యూట్యూబ్‌ స్టార్‌ డించాక్‌ పూజ..  కరోనా పై తనదైన శైలిలో  పాట విడుదల చేసింది. ‘కరోనా’ లిరిక్స్‌తో ప్రారంభమైన పాట..  బ్యాండ్‌ బృందం నృత్యంతో ఆకట్టుకుంటుంది. ఈ వీడియో అంతా ఇంట్లోనే చిత్రీకరించడంతో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దనే సందేశం వస్తుంది. దీంతో పాటు పాట మధ్యలో దగ్గు, చేతులు కడిగే సన్నివేశాలు, వాటికి కుటుంబీకులు స్పందించే తీరు అవగాహన కలిగించేలా ఉంది. ప్రజలను అప్రమత్తం చేసేలా.. డించాక్‌ పూజ చేసిన ఈ ప్రయత్నం ఒక్క రోజులోనే పాపులర్‌ అయింది.  ఇప్పటి వరకూ  రెండు లక్షల యాభై వేల వ్యూస్‌ వచ్చాయి. మీరూ చూడాలంటే ‘డించాక్‌ పూజా కరోనా సాంగ్‌ ’ అని  టైప్‌ చేసి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయండి.


logo