శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Mar 19, 2020 , 22:30:50

సర్దేయండిలా!

సర్దేయండిలా!

పుస్తకాలు, బట్టలు, ఫర్నీచర్‌ .. ఇలా చాలా వస్తువులు ఉన్న ఇంటిని చక్కబెట్టాలంటే కష్టంతో కూడుకున్న పనే. ఇలాంటప్పుడు  ఆ ప్రదేశం ఎంత చిన్నదైనా మనసు పెట్టి ఆలోచిస్తే చక్కగా వస్తువులను సర్దుకోవచ్చు. ఎలా అంటారా? పుస్తకాలన్నింటినీ వరుసగా.. సబ్జెక్ట్‌ పరంగా షెల్ఫ్‌లో సర్దండి. ఆ షెల్ఫ్‌కు ఆనుకొని ఒక పెద్ద సోఫా వేసుకొని. అందులో కూర్చొని, పడుకొని చదువుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. దిండు, బెడ్‌షీట్లను వేసుకునేలా పక్కనే ఒక బుట్ట. మరోవైపు చెప్పులు. సోఫాకు దగ్గరల్లోనే స్విచ్‌బోర్డ్‌ .. అన్నీ అరేంజ్‌ చేసుకుంటే అన్నీ దగ్గరగా ఉండి, శుభ్రంగా ఉంటాయి.logo