గురువారం 26 నవంబర్ 2020
Zindagi - Mar 16, 2020 , 23:10:11

ఆకట్టుకుంటున్న కరోనా పాట

ఆకట్టుకుంటున్న కరోనా పాట

కరోనాపై ఎవరికి తోచినట్లుగా వారు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో రష్మీ సర్వీ అనే యువతి తాజాగా తన పాట ద్వారా అవగహన కల్పిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. 2018లో హాలీవుడ్‌ సింగర్‌ కామిలా కాబెల్లో పాడిన పాట ‘హవానా’కు ‘కరోనా’ వెర్షన్‌తో పాడిన ఈ పాటను సోమవారం ఆమె ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోకు ‘ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ పరిశుభ్రంగా ఉండండి. మీకు ఎమైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి’ అంటూ రష్మీ ట్వీట్‌ చేసింది. 


కాగా “కరోనా.. హో.. నా.. నా. నా ఆలోచన మొత్తం నీ మీదే ఉంది కరోనా.. హో నానా. చైనా నుంచి వచ్చిన ఓ కరోనా..  నీలో ఏదో ఉంది కరోనా.. నా.. నా” అంటూ సాగే ఈ పాటతో రష్మీ  ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇప్పటి వరకూ ఆ పాటకు 13వేల వ్యూస్‌ వచ్చాయి. ‘తన వాయిస్‌ చాలా బాగుంది’. ‘అందమైన గొంతు నుంచి అద్భుతమైన సాహిత్యం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక  ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీ మహింద్రా గ్రూప్‌ సంస్థల యాజమాని ఆనంద్‌ మహింద్రా కూడా ఆమె పాటకు ఫిదా అయ్యారు. ఈ వీడియోను ఆయన తన ట్విటర్లో పంచుకుంటూ.. రష్మీపై ప్రశంసల జల్లు కురిపించారు.