ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 15, 2020 , 22:43:23

ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌కే మొగ్గు

ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌కే మొగ్గు

ఆన్‌లైన్‌లో ఆరోగ్య సేవలు పొందేవారి సంఖ్య దేశంలో పెరుగుతున్నది. వీరిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇటువంటి సేవలను పొందే మహిళల సంఖ్య ఏడు కోట్లు దాటిందని ఈ అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్‌ ద్వారా డాక్టర్‌ను సంప్రదించడం వల్ల తమ సమస్యలను దాపరికం లేకుండా చెప్పే వీలుకలుగుతున్నదని ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు చెబుతున్నారు. గతేడాది నుంచి ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ వృద్ధిరేటు 119 శాతం పెరిగింది.

  • ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించే మహిళల్లో అత్యధికంగా గైనిక్‌ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి కేసుల్లో 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న వారు 66 శాతం మంది ఉన్నారు. 
  • గతేడాదితో పోలిస్తే గైనిక్‌ సమస్యలతో డాక్టర్‌ను సంప్రదించే వారు 44శాతం పెరిగారు.
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు,  చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో  ఇటువంటి కేసులు 67 శాతం కనిపిస్తున్నాయి. 
  • అహ్మదాబాద్‌, జైపూర్‌, ఇండోర్‌, ఆగ్రా, వారణాసి వంటి నగరాల్లో 57 శాతం ఉన్నది. 
  • ఆఫీసు వేళలు పూర్తయిన తర్వాతనే ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 
  • శృంగారం, చర్మ సంబంధింత వ్యాధులతో డాక్టర్‌ను సంప్రదించేవారు రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నారు. 
  • సెక్స్‌ సంబంధిత సమస్యలతో బాధపడే వారు 130శాతం పెరిగినట్లు అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. 
  • ఎముకల సంబంధిత సమస్యలతో 40 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న మహిళలు 76 శాతంమంది వైద్యున్ని సంప్రదిస్తున్నట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. 


logo