ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 14, 2020 , 22:18:34

కరోనా బాధితుల కోసం..

కరోనా బాధితుల కోసం..

కరోనా వైరస్‌ వ్యాప్తి భారతదేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ప్రతిరోజూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 80 మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ కారణంగా మరణించిన వారు ఢిల్లీ, కర్ణాటకకు చెందిన వారే. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి ప్రతిపాదించారు. కర్ణాటక ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అందులో ‘ఒక హాస్పిటల్‌ను ఖాళీ చేసి, కోవిడ్‌-19 పాజిటివ్‌ రోగుల చికిత్స కోసం అంకితం చేయాలి. కనీసం 500-700 పడకలు ఉండేలా ఏర్పాటు చేయాలి. దీనికి ఆక్సీజన్‌ లైన్లు, పైపులు సమకూర్చాలని అభ్యర్థిస్తున్నాను’ అని ప్రభుత్వాన్ని కోరింది. 


ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందితే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కేసులను నిర్వహించడం కష్టమవుతుంది. అన్ని పాఠశాలలు, కళాశాలలు, మాల్స్‌, థియేటర్లు అన్ని ఎయిర్‌ కండిషన్డ్‌ ప్రాంతాలను మూసివేయాలి. ఫార్మసీ, కిరాణా దుకాణాలు వంటి అవసరమైన వాటిని తెరిచి ఉంచాలని సుధామూర్తి లేఖలో కోరారు. ఆమె కోరికకు స్పందించిన డాక్టర్లు కొంతమంది సుధాకు సెల్యూట్‌ కొడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడానికి ముందుకు వస్తున్నారు.


Next Article వాస్తు

logo