శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 13, 2020 , 23:16:57

మీకు కూతురుందా?

మీకు కూతురుందా?

కూతురు పుడుతుందని పురిట్లోనే కడతేర్చేందుకు సిద్ధమయ్యే తండ్రులారా.. ఆడబిడ్డల వల్ల మీ ఆయుష్షు పెరుగుతుందట తెలుసుకోండి. ఓ అధ్యయనం ప్రకారం కుమార్తెలున్న తండ్రులే ఎక్కువకాలం జీవిస్తున్నారట తెలుసా?

పోలాండ్‌కు చెందిన జాగిల్లోనియన్‌ యూనివర్సిటీ 4వేలకు పైగా కూతుర్లు ఉన్న తల్లులు, తండ్రులను అధ్యయనం చేసింది. కూతుర్లున్న తండ్రుల ఎక్కువ కాలం బతుకుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇంట్లో ఆడపిల్లలు లేని తండ్రులు త్వరగా కాలం చేశారట. అందుకే మనదేశంలో ‘ఆడపిల్ల మనింటి మహాలక్ష్మి’ అంటుంటారు. కుమారులకంటే కూతుళ్లే తండ్రులను జాగ్రత్తగా, బాధ్యతతో చూసుకుంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బయోలజీ’లో ప్రచురించారు కూడా. మరో అధ్యయనంలో కూతుళ్ల వల్ల కొందరు తల్లుల ఆయుష్షు తగ్గుతుందని, ఒంటరిగా ఉండే మహిళలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని తెలిసింది. అంతేకాకుండా తండ్రీ కూతుళ్ల మధ్య ఎఫెక్షన్‌, ఎమోషన్‌ ఎక్కువగా ఉంటుందని జాగిల్లోనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.


logo