ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 13, 2020 , 23:15:23

నెలరోజుల్లో సెలబ్రిటీ

నెలరోజుల్లో సెలబ్రిటీ

ఆమె ఓ కానిస్టేబుల్‌. పోలీస్‌స్టేషన్‌లో టిక్‌టాక్‌ చేసింది. ఫలితంగా సస్పెండ్‌ అయ్యింది. ఇంతటితోనే ఆమె ఆగిపోలేదు. జరిగిందానికి కుంగిపోలేదు. తనకున్న ప్రతిభను మరింత మందికి చేరవేయాలనుకుంది. తన సస్పెండ్‌కు కారణమైన టిక్‌టాక్‌నే సాధనంగా నెలరోజుల్లోనే మార్చుకుంది. ఇప్పుడామె ఓ స్టార్‌గా మారిపోయింది.

అల్పితాచౌదరిది గుజరాత్‌. నెల క్రితం డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫార్మ్‌ వేసుకొని టిక్‌టాక్‌ వీడియో చేసింది. ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మిలియన్స్‌ వ్యూస్‌, లక్షల్లో లైక్స్‌.. వచ్చాయి. అదే సమయంలో ఉన్నతాధికారులు స్పందించి ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ కూడా చేశారు. నెల రోజుల సస్పెండ్‌ సమయంలో అల్పితాచౌదరి మరిన్ని టిక్‌టాక్‌ వీడియోలు చేసింది. కేవలం టిక్‌టాక్‌లు చేయడమే కాదు. అల్పితాచౌదరి మంచి గాయని కూడా.. అభినయం, అందం ఉండడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఉద్యోగానికి లాంగ్‌ లీవ్‌ పెట్టి సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు.


logo