ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 13, 2020 , 23:11:02

పట్టు.. ఆకట్టు

పట్టు.. ఆకట్టు

 బాలీవుడ్‌ స్టార్‌ కాజోల్‌ తన గారాలపట్టి ‘నిషా’ ఫొటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. నిషా విదేశాల్లో చదువుకుంటున్నది. సెలవులకు మాత్రమే ఇంటికి వస్తుంటుంది. మొన్న హోలీ పండుగ సందర్భంగా తల్లి కాజోల్‌.. నిషా ఫొటోను ‘హ్యాపీ హోళీ’ అని షేర్‌ చేసింది. ఆ ఫోటోలల్లో ఆ స్టార్‌ కిడ్‌ చిరునవ్వులతో, పట్టు దుస్తుల్లో  అందంగా కనిపిస్తున్నది. ఆమె వి-నెక్‌లైన్‌, మల్టీ-లేయర్డ్‌ స్కర్ట్‌తో అలరించింది. సీక్వెన్డ్‌ బ్లౌజ్‌తో బంగారు లెహంగా ధరించింది. ఈ వస్త్రధారణనే ప్రత్యేక ఆకర్షణగా నిలువడంతో నిషా ఫొటోలు నెట్టింటా పాపులర్‌ అవుతున్నాయి.logo