శనివారం 29 ఫిబ్రవరి 2020
లవ్లీ లేయర్స్‌!

లవ్లీ లేయర్స్‌!

Feb 13, 2020 , 23:04:12
PRINT
లవ్లీ లేయర్స్‌!

లెహంగా.. గాగ్రాచోళీ.. పేరు ఏదైతేనేం.. శతాబ్దాలుగా రాజ్యమేలుతున్న ట్రెండ్‌ ఇది.. దీన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా డిజైన్‌ చేస్తూ.. మరిన్ని మెరుగులద్దుతూ మగువల మనసు దోచేలా చేయాలి.. అందుకే ఇప్పుడు అంతా లేయర్ల బాట పట్టారు.. ఇప్పుడు నడుస్తున్న నయా ట్రెండ్‌ ఇది.. లేలేత వర్ణాల సోయగాలకు.. లేయర్లు అద్ది మరీ డిజైన్‌ చేసిన లెహంగాలు మీకోసం..


ఆకుపచ్చని అందం చూడతరమా అన్నట్లుగా ఈ లెహంగా ఉంది. రాసిల్క్‌ లెహంగా మీద థ్రెడ్‌, జరీ వర్క్‌తో హెవీగా వర్క్‌ చేయించాం. పార్టీల్లో జిగేల్‌మనిపించేలా ఈ లెహంగాని డిజైన్‌ చేశాం. రాసిల్క్‌ బ్లౌజ్‌ని కాస్త డిఫరెంట్‌గా ఉండాలని.. పెటర్‌పాన్‌ కాలర్‌ ఇచ్చాం. దీనిమీద వర్క్‌ చేయించాం. ఇక స్లీవ్స్‌ని లేయర్లుగా డిజైన్‌ చేయడంతో ైస్టెలిష్‌ లుక్‌ సొంతమైంది. 


ైస్టెలిష్‌గా ఉండాలనుకునే వారు ఈ డ్రెస్‌ ఎంచుకోవాల్సిందే! బీజ్‌ కలర్‌ రాసిల్క్‌ లెహంగానిలేయర్లుగా డిజైన్‌ చేశాం. పైన నెట్‌ మీద పూర్తి జరీ, థ్రెడ్‌ వర్క్‌తో హెవీగా నింపేశాం. చివర మాత్రం కట్‌ వర్క్‌ బార్డర్‌ ఇచ్చాం. రాసిల్క్‌ బ్లౌజ్‌కి ‘వీ’నెక్‌ ఇచ్చాం. డ్స్‌, బ్లౌజ్‌ మీద ఫెదర్‌ వర్క్‌తో నింపేసరికి సూపర్‌గా కనిపిస్తున్నది. 

సీ బ్లూ కలర్‌ నెట్‌ లెహంగా ఇది. దీన్ని లేయర్లుగా డిజైన్‌ చేశాం. లెహంగా మొత్తం క్రీపర్‌ వర్క్‌తో నింపేశాం. కట్‌ వర్క్‌ బార్డర్‌ డ్రెస్‌ అందాన్ని రెట్టింపు చేసింది. ఇదే రంగు నెట్‌ బ్లౌజ్‌ మీద పీచ్‌ కలర్‌ థ్రెడ్‌, సిల్వర్‌ కట్‌దానాతో హెవీగా వర్క్‌ చేశాం. నెక్‌లైన్‌, స్లీవ్స్‌కి కట్‌ వర్క్‌ చేశాం. నెట్‌ దుపట్టా మీద కూడా ఇదే వర్క్‌ చేయించడంతో సూపర్‌గా మెరిసిపోతున్నది. పీచ్‌ హెవీ వర్క్‌ నెట్‌ లెహంగాని లేయర్లుగా డిజైన్‌ చేసి హెవీగా వర్క్‌ చేయించాం. పెద్ద పెద్ద మోటిఫ్స్‌తో లెహంగా మొత్తం నింపేశాం. చివరన మాత్రం హెవీగా కట్‌వర్క్‌తో నింపేశాం. ఇదే నెట్‌ ఫ్యాబ్రిక్‌ని బ్లౌజ్‌గా ఎంచుకున్నాం. దానిమీద మాత్రం చిన్న పువ్వుల క్రీపర్‌ వర్క్‌ బ్లౌజ్‌ అందాన్ని రెట్టింపు చేసింది. డబుల్‌ షేడెడ్‌ నెట్‌ దుపట్టా మీద కూడా క్రీపర్‌ కట్‌ వర్క్‌ బార్డర్‌ రావడం దీనికి అదనపు ఆకర్షణ. పౌడర్‌ బ్లూ కలర్‌ నెట్‌ లెహంగా ఇది. దీన్ని లేయర్లుగా డిజైన్‌ చేశాం. పైన లేయర్‌ మీద పీచ్‌కలర్‌లో కట్‌దానా వర్క్‌ చేశాం. అక్కడక్కడ సీక్వెన్స్‌ చిన్న బుటీస్‌ ఇచ్చాం. పౌడర్‌ బ్లూ సిల్క్‌ బ్లౌజ్‌ మీద పిట్టల డిజైన్‌ ఆకట్టుకునేలా ఉంది. హెవీగా ఈ వర్క్‌తోనే నింపేశాం. ఇదే రంగు నెట్‌ దుపట్టా మీద కట్‌వర్క్‌ బార్డర్‌ ఇచ్చి, అక్కడక్కడ చిన్న బుటీస్‌ ఇవ్వడం దీనికి పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయింది. 


  • రాజ్‌ సారెపల్లి ,ఫ్యాషన్‌ డిజైనర్‌ ,సువర్ణ మందిర్‌ సిల్క్స్‌ 
  • facebook.com/
  • SriSuvarna, Mandir 
  • ఫోన్‌ : 9000305077


logo