శనివారం 29 ఫిబ్రవరి 2020
మీరే.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌!

మీరే.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌!

Feb 13, 2020 , 22:49:29
PRINT
మీరే.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌!

Love Is Beautiful. నిర్వచనం అక్కర్లేనంత బ్యూటీఫుల్‌. ఇది.. మనసుకు సంబంధించింది. మాటలతో పనిలేనంత మధురమైంది. కానీ.. కొందరు చచ్చేంత ప్రేమ అంటారు. మరి కొందరు చంపేంత ప్రేమ అంటారు. ప్రేమంటే ఇదేనా.? What Is True Love.? మీరు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఔనా? కాదా? ఫిబ్రవరి 14th .. వాలెంటైన్స్‌ డే సందర్భంగా మరొకసారి ప్రేమ తలుపులు తెరుద్దాం రండీ!

  • (Love Version 2.0)

చచ్చేంత ప్రేమ.. చంపేంత ప్రేమ.. ఈ రెండింట్లో ఏది ట్రూ లవ్‌? ఇద్దరూ కలిసి ఉండేది ట్రూ లవ్‌. ఇద్దరికీ ఇష్టాలు.. కష్టాలు పంచుకోవడం ట్రూ లవ్‌. సుఖాల్ని.. సంతోషాల్ని సమానంగా అనుభవించడం ట్రూ లవ్‌. అంటే.. ప్రేమ ఎల్లప్పుడూ తోడుగా ఉండేదన్నమాట. ప్రేమకు అడ్డంకులు రావని కాదు.. సృష్టించరనీ కాదు. వాటిని అధిగమించి గెలుచుకోవడం నేర్చుకోవాలి. ప్రేమను సజీవంగా బతికించుకొని.. ప్రేమికులూ బతకాలి. ఆ ప్రేమ శాశ్వతంగా ఒక జ్ఞాపకమై వర్ధిల్లాలి. 


ఇచ్చి.. పుచ్చుకునే ప్రేమ 

‘మోరీ’ అనే ఒక ప్రేమికుడు అంటాడు. The most Important thing in life is to learn how to give out Love, and to let it come in అని. వాస్తవమే కదా? ప్రేమను ఎలా ఇవ్వాలో.. ఎలా పొందాలో నేర్చుకోవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. చాలా ప్రేమలు విఫలమయ్యేది ఇక్కడే. ప్రేమిస్తున్నాం అంటారు.. కానీ దానిని అవతలి వ్యక్తికి ఎలా ఇవ్వాలో.. తిరిగి ప్రేమను ఎలా పొందాలో తెలియక తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. 


సాహసించి.. సంతోషించే ప్రేమ 

ప్రేమ ఎప్పుడు పుట్టింది? మనిషి పుట్టినప్పుడు మనిషితోపాటు ప్రేమ కూడా పుట్టింది. ఏ ప్రేమ కూడా కలలో కలవరించగానే వచ్చి ఒళ్లో కూర్చోదు. సహవాస ధ్యాసే కాదు.. సాహసం కూడా ఉంటేనే ప్రేమను గెలుచుకోవచ్చు. రాతియుగం.. రాజుల కాలం నాటి ప్రేమలు ఇవే సందేశాన్నిస్తున్నాయి. ఈ రూట్లో వెళ్తేనే ప్రేమను ఆస్వాదించొచ్చు. ప్రేమ అడ్డంకులను గుర్తించదు. వాటిని దాటేసుకుంటూ వెళ్తుంది. పెద్దవాళ్లను ఒప్పించి ఒక్కటయ్యేలా ప్రేరేపిస్తుంది. ‘మాయా’ అనే ఒక ప్రేమికురాలు తన అనుభవాల్ని పంచుకుంటూ.. Love recognizes no barriers. It jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.. అంటున్నారు. 


ఒప్పించి.. మెప్పించే ప్రేమ  

ప్రేమకు కళ్లుండాలి.. చెవులుండాలి.. అన్నింటికీ మించి మంచి హృదయం ఉండాలి. ఏ పేరెంటూ తమ పిల్లలు ఆగమవ్వాలి అనుకోరు. లవ్‌ ఏదో.. అఫెక్షనేదో తెలియకుండా గుడ్డిగా ప్రేమించొద్దు అనేది వారి ఆవేదన. ప్రేమను ఒప్పుకునేందుకు గతంలో కులం.. ఆస్తి చూసేవారు. కానీ ఇప్పుడు గుణం చూస్తున్నారు. ఆ గుణవంతుల్లో గనుక మీరు ఉంటే.. ప్రేమను ఎక్కడో వెతికే పనిలో కాకుండా దానికి వ్యతిరేకంగా ఉన్న పెద్దలకు ఒప్పించే పనిలో ఉండటం మంచిది. ‘రుమి’ ప్రేమ గురించి ప్రస్తావిస్తూ.. Your task is not to seek for love, but merely to seek and find all the barriers within yourself that you have built against it అని సూచిస్తున్నారు. 


ప్రార్థించి.. ప్రాధేయపడే ప్రేమ 

ప్రేమలెప్పుడూ విజయవంతం కావాలి. కానీ విషాదం కాదు. పెద్దలు గతంలో వేరేలా ఆలోచించేవాళ్లు.  ఇప్పుడు అప్‌డేట్‌ అయ్యి ఆలోచిస్తున్నారు. అన్నింట్లో మాదిరి ప్రేమ లోనూ స్వేచ్ఛ ఇస్తున్నారు. ఆ స్వేచ్చను దుర్వినియోగం చేసుకోవద్దు. మీరు పొందాలనుకునే ప్రేమ దక్కదని భావిస్తే వేధించొద్దు. ప్రార్థించాలి. అంతకాదంటే ప్రాధేయపడాలి. జూలియా రాబర్ట్స్‌ అన్నట్టు.. You know its love when all you want is that person to be happy, even if youre not part of their happiness  అనేది పాటించాలి. అంటే.. మీరు ఒక వ్యక్తి ప్రేమను పంచుకోవడంలో భాగం కాకపోయినా.. వారి సంతోషాన్ని కోరుకోవడమే నిజమైన ప్రేమ అన్నట్టు. 


ప్రేమించి.. పెండ్లి చేసుకునే ప్రేమ 

ప్రేమను గెలుచుకోవడం నిజంగా ఒక వరం లాంటిదే. ప్రేమ విషయంలో అది వరమైనా.. శాపమైనా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక పంట లాంటిది. మంచి ఎరువులేసి.. కలుపుతీసి పండిస్తే బాగా పండుతుంది. ఏదీ సక్రమంగా చేయకుండా ఉంటే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రేమను పెండ్లిదాకా తీసుకెళ్లాలంటే ఆ ప్రేమలో స్వచ్ఛత పుష్కలంగా ఉండాలి. ఆస్కార్‌ వైల్డ్‌ దీని గురించి ఏమంటారంటే.. ‘Keep love in your heart. A life without it is like a sunless garden when the flowers are dead’ అని. అంటే.. ప్రేమను మీ గుండెల్లో ఉంచుకోండి. అది లేని జీవితం పువ్వుల్లేని తోటకు సూర్యరశ్మి సోకడం లాంటిదన్నమాట. 

ఫైనల్‌గా.. ప్రేమ శాశ్వతం. దాని జ్ఞాపకాలు శాశ్వతం. ఒక తాజ్‌మహల్‌.. ఒక పురానాపూల్‌.. ఒక చార్మినార్‌.. ఒక హైదరాబాద్‌లా. ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకునేదై ఉండాలి. జీవితాంతం వెన్నంటి ఉండేదై ఉండాలి. పెద్దలను గౌరవించేదై ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు world Famous Lover అయినట్టే. 

హ్యాపీ వాలెంటైన్స్‌ డే.  ప్రేమా జిందాబాద్‌.!! 


logo