శనివారం 29 ఫిబ్రవరి 2020
చీరెకట్టు.. ఓ ప్రమోషన్‌ ట్రెండ్‌!

చీరెకట్టు.. ఓ ప్రమోషన్‌ ట్రెండ్‌!

Feb 13, 2020 , 22:46:46
PRINT
చీరెకట్టు.. ఓ ప్రమోషన్‌ ట్రెండ్‌!

ఇటీవల జరిగిన ‘జాను’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సమంత కట్టుకున్న చీరెను గమనించారా? ఆ చీరెపై ‘జాను’ అని గులాబీ రంగులో రాసి ఉంది. అంతకుముందు బాలీవుడ్‌ మూవీ ‘గుడ్‌ న్యూజ్‌' ప్రమోషన్‌లో కూడా హీరోయిన్‌ కరీనాకపూర్‌ ఖాన్‌ ‘బేబో’ అని రాసిన చీరెను ధరించి ఆకట్టుకున్నారు. మీకు తెలుసా..? ఇలాంటి చీరె కట్టుడు ఓ నయా ట్రెండ్‌.

గ్రాండ్‌ ఈవెంట్లు, బహిరంగ ప్రదర్శనలు, సినిమా ప్రమోషన్లు.. కార్యక్రమం ఏదైనా చీరెకట్టు ఓ ప్రత్యేకమైతే.. ఆ చీరెపై ఓ సందేశం, పేరు ఉండడం ఓ సరికొత్త ట్రెండ్‌. బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ ఖాన్‌ మొదలుపెట్టిన ఈ ట్రెండ్‌ను ఇప్పుడిప్పుడే సినీ జనాలు అలవాటు చేసుకుంటున్నారు. ‘జాను’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో లేత గులాబీరంగు చీరెలో మెరిసిపోయింది సమంత. చీరెకట్టుతో ఆ వేడుకకే అందం తీసుకొచ్చింది. ఆమె కట్టుకున్న చీరెపై ‘జాను’ అని గులాబీ రంగులో రాసి ఉంది. అంతకుముందు ఇలాగే బాలీవుడ్‌ మూవీ ‘గుడ్‌ న్యూజ్‌' ప్రమోషన్‌లో కూడా హీరోయిన్‌ కరీనాకపూర్‌ ఖాన్‌ ‘బేబో’ అని రాసిన లేత ఆకుపచ్చ రంగు చీరెను ధరించి ఆకట్టుకుంది. 


కరీనా బాటలోనే సమంత కూడా తెలుగు సినీ అభిమానులకు ఈ సరికొత్త ట్రెండ్‌ను పరిచయం చేసింది. వీరిద్దరూ ధరించినవి ‘ఆర్గాంజా’ చీరెలే. ఈ సిల్క్‌ ప్రింటెడ్‌ చీరెలు ఎంబ్రాయిటరీ ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఈ చీరెపై హ్యాండ్‌వర్క్‌తో నచ్చిన డిజైన్‌ చేయించుకోవచ్చు. మీకు నచ్చిన సందేశం ప్రింట్‌ చేసుకోవచ్చు. ఇద్దరు సినీతారలు ఇలాంటి చీరెలను తమ ప్రమోషన్ల కోసం వాడడంతో.. వీరి బాటలోనే మరికొంత మంది తమకు నచ్చిన పేర్లను చీరెలపై ప్రింట్‌ వేయిస్తున్నారు. ఈవెంట్‌కు తగ్గట్లుగా పేర్లను చీరెపై ముద్రిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.


logo