శనివారం 29 ఫిబ్రవరి 2020
బెర్రీ.. బెర్రీ మాక్‌టెయిల్స్‌

బెర్రీ.. బెర్రీ మాక్‌టెయిల్స్‌

Feb 12, 2020 , 23:28:48
PRINT
బెర్రీ.. బెర్రీ మాక్‌టెయిల్స్‌

మ్యాంగో జ్యూస్‌, ఆరెంజ్‌ జ్యూస్‌.. ఇలా..ఏదైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.మరి, మాక్‌టెయిల్‌ మాటేమిటి? ఇది తాగాలంటే..స్టార్‌హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్లనవసరం లేదు..ఇంట్లోనే చేసుకొని తాగొచ్చు అంటున్నారు ప్రముఖ చెఫ్‌లు. ఎండలు ముదిరాక ప్రిపరేషన్‌ మొదలుపెట్టడంకంటే.. ముందుగానే తయారు చేయడం నేర్చుకుంటే మంచిది. అందుకే రకరకాల మాక్‌టెయిల్స్‌ మీకోసం..

రాసెర్రీ సోడా

కావాల్సినవి :

ఫ్రోజన్‌ రాసెర్రీ సోడా : 100 గ్రా.

చక్కెర సిరప్‌ : 20 మి.లీ.

సోడా : 90 మి.లీ.

పుదీనా : సరిపడా


తయారీ :

ఫ్రోజన్‌ రాసెర్రీకి చక్కెర సిరప్‌ కలుపాలి. దీనికి సోడా జోడించాలి. తర్వాత మిశ్రమాన్ని గ్లాస్‌లోకి సర్వ్‌ చేసుకోవాలి. పుదీనాతో గార్నిష్‌ చేసుకొని తాగితే అద్భుతంగా ఉంటుంది.రుస్టమ్‌ షేక్‌


కావాల్సినవి :

తమలపాకు : ఒకటి

గుల్‌కండ్‌ : 2 బార్‌ స్పూన్స్‌ (100 మి.లీ)

వనిల్లా ఐస్‌క్రీమ్‌ : 2 స్కూప్స్‌

బాదంపప్పు : 3తయారీ :

తమలపాకు , గుల్‌కండ్‌, వనిల్లా ఐస్‌క్రీమ్‌, బాదంపప్పును జార్‌లోకి తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టించి మాసన్‌ జార్‌లోకి సర్వ్‌ చేసుకోవాలి. తర్వాత తమలపాకులతో గార్నిష్‌ చేసుకొని సేవిస్తే టేస్ట్‌ అదిరిపోతుంది.బ్లూబెర్రీ స్మూతీ


కావాల్సినవి : 

బ్లూబెర్రీస్‌ : 8,

తులసి ఆకులు : 2,

పెరుగు : 100 మి.లీ.,

తేనె : 30 మి.లీ


తయారీ : 

బ్లూబెర్రీస్‌, తులసి ఆకులు, పెరుగు, తేనెలను తగిన మోతాదులో తీసుకొని మిక్సీ పట్టించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మాసన్‌ జార్‌లోకి సర్వ్‌ చేసుకొని మిగిలిన తులసి ఆకులతో గార్నిష్‌ చేసుకోవాలి. ఇక అంతే.. ఎంతో రుచికరమైన బ్లూబెర్రీ స్మూతీ రెడీ!కోల్డ్‌ కాఫీ


కావాల్సినవి :

ఎస్ప్రెస్సో : 30 మి.లీ.

వనిల్లా ఐస్‌క్రీమ్‌ : 2 స్కోప్స్‌

పాలు : 100 మి.లీ.

చక్కెర సిరప్‌ : 20 మి.లీ.

కాఫీ బీన్స్‌ : 3


తయారీ :

ముందుగా ఎస్ప్రెస్సో, వనిల్లా ఐస్‌క్రీమ్‌, పాలు, చక్కెర సిరప్‌ పదార్థాలన్నింటినీ జార్‌లో వేసి మిక్సీ పట్టించాలి. తర్వాత మిశ్రమాన్ని జార్‌ గ్లాస్‌లోకి సర్వ్‌ చేసుకొని కాఫీ బీన్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే కోల్డ్‌ కాఫీ టేస్టీగా ఉంటుంది.ఫైవ్‌ బెర్రీ సోబర్‌ సాంగ్రియా


కావాల్సినవి : బెర్రీ,

 కాక్‌టైల్‌ షేక్‌ : 100 గ్రా. 

క్రాన్‌బెర్రీ జ్యూస్‌ : 90 మి.లీ.

ఆరెంజ్‌ జ్యూస్‌ : 90 మి.లీ.

పీచ్‌ సిరప్‌ : 20 మి.లీ.

ఐస్‌క్యూబ్స్‌ : 4

ఆరెంజ్‌ ముక్కలు : సరిపడా


తయారీ :

బెర్రీని కాక్‌టెయిల్‌ షేకర్‌తో మిక్స్‌ చేయాలి. ఇందులో క్రాన్‌బెర్రీ జ్యూస్‌, ఆరెంజ్‌ జ్యూస్‌, పీచ్‌ సిరప్‌, ఐస్‌ క్యూబ్స్‌ వేసి బాగా కలుపాలి. దీన్ని గ్లాసులోకి సర్వ్‌ చేసుకోవాలి. తర్వాత ఆరెంజ్‌ ముక్కలతో అలంకరించుకుంటే ఫైవ్‌ బెర్రీ సోబర్‌ సాంగ్రియా తయారైనట్లే!


  • అనీష్‌ ,చెఫ్‌ 
  • సోడా బాటిల్‌ ఓపెనర్‌వాలా
  • జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ 


logo