శనివారం 29 ఫిబ్రవరి 2020
స్వగ్రామం బాగుకోసం

స్వగ్రామం బాగుకోసం

Feb 12, 2020 , 23:26:46
PRINT
స్వగ్రామం బాగుకోసం

విద్యావంతురాలై విదేశాల్లో స్థిరపడింది. అదే సమయంలో ఆమె పుట్టిన ఊరికి సేవలందించే అవకాశం వచ్చింది. తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సొంతూరి బాగుకోసం ముందుకు వచ్చింది. సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ జాతీయ స్థాయి పురస్కారాలు అందుకుంటున్నదీమె.

మధ్యప్రదేశ్‌లోని ‘భర్‌కేడి అబ్దుల్లా ’గ్రామానికి చెందిన భక్తిశర్మ అనే మహిళ ఉన్నత చదువులు చదివింది. అనంతరం అమెరికాలో ఆమెకు ఉద్యోగం లభించింది.  ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయింది. అదే సమయంలో భక్తిశర్మ పుట్టిన ఊరికి సేవలందించే అవకాశం వచ్చింది. దీంతో విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సొంతూరుకు వచ్చింది. విద్యావంతులు ఊరుబాగు కోసం ముందుకు రావడం వల్ల ఆయా గ్రామాలు ప్రగతి పథంలో రాణించగలుగుతున్నాయి. చదివిన చదువును పుట్టిన ఊరిబాగుకోసం ఉపయోగిస్తే జీవితంలో అంతకుమించిన ఆనందం ఉండదు. ఇదే విషయాన్ని భక్తిశర్మ ఓ పుస్తకంలో చదివి తెలుసుకున్నది. ఆ సమయంలోనే సొంత గ్రామమైన ‘భర్‌కేడి అబ్దుల్లా ’కు సేవలందించాలనుకున్నది. అందుకోసం అమెరికా ఉద్యోగాన్ని వదిలి సొంతూరుకు వచ్చేసింది. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. భక్తిశర్మ పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేసింది. జనాలు పడే ఇబ్బందులను గుర్తించి అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది. 


ప్రజాసమస్యలను తెలుసుకొనేందుకు గ్రామ సభలను ఏర్పాటు చేసింది. వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఆమె సర్పంచ్‌గా పదవి చేపట్టక ముందు ఆగ్రామంలో పది కుటుంబాలకు మాత్రమే సొంత ఇండ్లున్నాయి. భక్తిశర్మ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 80 శాతం మందికి ఇండ్లు నిర్మించి ఇచ్చింది. పరిసరాల పరిశుభ్రతతోపాటు పచ్చదనాన్ని పెంచడంలో ఆ ఊరి ప్రజలను భాగస్వాములను చేసింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నది. పలు చేతివృత్తులపై వారికి శిక్షణ ఇప్పించింది. ఊరికి రవాణా సౌకర్యం, వైద్యం, విద్య వంటి సదుపాయాలు అందించి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దింది. భక్తిశర్మ అందించిన సేవలకుగానూ అనేక జాతీయ స్థాయి అవార్డులూ ఆమెను వరించాయి. 


logo