శనివారం 29 ఫిబ్రవరి 2020
కేరళ బడ్జెట్‌ కవర్‌పేజీగా..

కేరళ బడ్జెట్‌ కవర్‌పేజీగా..

Feb 12, 2020 , 23:24:51
PRINT
కేరళ బడ్జెట్‌ కవర్‌పేజీగా..

ప్రతిభ ఉన్నవారికి వయసుతో పనిలేదు. ఎప్పుడైనా ఎలా అయినా ఏదో రూపంలో గుర్తింపు వస్తుంది. అలా కేరళ ప్రభుత్వం జెండర్‌ బడ్జెట్‌ కవర్‌పేజీగా ఓ బాలుడి పెయింటింగ్‌ను ఎంచుకున్నది. ఈ చిత్రం ఆలోచింపచేసేది కావడం విశేషం.

త్రిసూర్‌కు చెందిన అనుజత్‌ సింధు వినయల్‌ 9వ తరగతి చదువుతున్నాడు. అతనికి పెయింటింగ్‌ అంటే ఇష్టం. నాలుగేండ్ల వయసులోనే కుంచె పట్టుకున్నాడు. అమ్మ దగ్గర పెయింటింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. దురదృష్టవశాత్తు గత ఏడాది నవంబర్‌ 14న అనుజత్‌ తల్లి ఆనారోగ్యంతో మరణించింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆ కుటుంబానికి చాలారోజులు పట్టింది. అనుజత్‌ పెయింటింగ్‌లో రాణించడానికి తన తల్లే కారణం.  ప్రతి పెయింటింగ్‌ను మునుపటి చిత్రాల కంటే మెరుగ్గా వేయడానికి ప్రోత్సహించేది. ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020 కోసం భారత కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. దేశబడ్జెట్‌ కేటాయింపు తర్వాత కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ 2020-2021 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్ల గురించి కొంతమేరకు తెలుసుకున్న వినయల్‌ మనసులోని భావాలను కుంచె ద్వారా స్పష్టీకరించాడు. ఇంటి ఆవరణలో జరిగే పనులన్నింటినీ ఒకే చిత్రపటంలో చిత్రించాడు. దీన్నే కేరళ ప్రభుత్వ బడ్జెట్‌ కవర్‌పేజీగా ఎంపిక చేశారు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి.  దీనికి ‘మై మథర్‌ అండ్‌ మదర్స్‌ ఇన్‌ ది నైబర్‌హుడ్‌' (నా తల్లి, పొరుగున్న ఉన్న తల్లులు) అనే శీర్షికతో విడుదల చేశాడు. తన పెయింటింగ్‌ బడ్జెట్‌ కవర్‌పేజీగా ఎంపిక అవ్వడంతో అనుజిత్‌ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. ‘నా చదువు పూర్తి చేసిన తర్వాత వృత్తిపరంగా చిత్రకారుడిగా కొనసాగించాలని ఆశిస్తున్నాను’ అని అనుజిత్‌ పేర్కొన్నాడు. logo