శనివారం 29 ఫిబ్రవరి 2020
కరోనాపై వినూత్న పోరాటం

కరోనాపై వినూత్న పోరాటం

Feb 11, 2020 , 23:18:06
PRINT
కరోనాపై వినూత్న పోరాటం

కరోనా వైరస్‌ ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటున్నది. దీని వల్ల మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారికి అవగాహన కల్పించేందుకు ఓ వైద్యురాలు ముందుకు వచ్చింది. ఈ వైరస్‌ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా జనాలను చైతన్య పరుస్తున్నది.

చైనాలో మొదలైన కరోనా వైరస్‌  ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్నది. అటువంటి అపోహలను తొలగించేందుకు షాడాంగ్‌కు చెందిన యువన్‌హెరన్‌ అనే వైద్యురాలు నడుం బిగించింది. అందుకోసం ఆమె వీడియో గేమ్‌ ‘చున్‌ లీ’ క్యారెక్టర్‌ వేషధారణతో ముందుకు వచ్చింది. ఈ గెటప్‌ ద్వారా వేలాదిమంది ప్రాణాలను బలికొంటున్న కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నది. ఆమె తల్లిదండ్రులు వైద్యులు కావడంతో చిన్నప్పటి నుంచి హెరన్‌ కూడా డాక్టర్‌ కావాలనుకున్నది. ఐదేండ్ల వయసులోనే యువన్‌హెరన్‌కు వ్యాయామంపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే ఆమె కండలు పెంచింది. ‘ఎటువంటి అంటువ్యాధినైనా అంతమొందించే శక్తి వ్యాయామానికి ఉన్నదని’ ఆమె చెబుతున్నది.


 ‘కండరాలు దృఢంగా ఉండడం వల్ల మానసిక సమస్యలు కొంతమేర దూరమవుతాయని అంటున్నది. ‘ఏదో జరిగిపోతుందనే భయం మనిషిని మరింతగా కుంగదీస్తుంది. అనవసరమైన భయాందోళనకు గురికాకుండా ఉండాలంటున్నది. చైనా సంప్రదాయ చికిత్స విధానాలను అనుసరిస్తే ఇటువంటి అంటువ్యాధుల బారి నుంచి ప్రాణాలను కాపాడు కోవచ్చని’ హెరాన్‌ వివరిస్తున్నది. ‘ప్రాణాలను తీసే వ్యాధి అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలని’ సోషల్‌ మీడియా వేదికగా సూచిస్తున్నది. ‘చైనా సంప్రదాయ చికిత్స విధానాల ద్వారా 100 మంది రోగుల ప్రాణాలను రక్షించామని’ హెరన్‌ పేర్కొన్నది. 


logo