గురువారం 04 జూన్ 2020
Zindagi - Feb 09, 2020 , 22:35:15

కాకరతో పూత మాయం

కాకరతో పూత మాయం

  • ఆకలి తక్కువగా ఉన్నవారు చింతపండు రసాన్ని అన్నంలోకి తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది.
  • అలసట లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజూ కొబ్బరినీళ్ళుగాని, బత్తాయి పండ్లరసం గాని తీసుకోవాలి.
  • ప్రతిరోజూ కాకరకాయ రసాన్ని పుక్కిలిస్తూ ఉంటే నోట్లో నాలుకపూత, పళ్లు పుచ్చిపోవడాన్ని అరికట్టవచ్చు.
  • ప్రతిరోజు ఒక పచ్చి కరక్కాయ తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.
  • కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలకు నీటిలో పుదీనా ఆకులు వేసి బాగా మరగించి చల్లార్చి తాగితే మంచిది.
  • నిద్రలేమితో బాధపడేవారు ధనియాల కషాయం చేసుకొని అందులో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.
  • ధనియాల పొడిలో ఉప్పు కలుపుకొని రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే అజీర్తి బాధ తగ్గి ఆకలి బాగా అవుతుంది.


logo