శనివారం 29 ఫిబ్రవరి 2020
ఆవలింత మంచిదేనా?

ఆవలింత మంచిదేనా?

Feb 07, 2020 , 22:16:53
PRINT
ఆవలింత మంచిదేనా?

  • గర్భంలో ఉండగానే శిశువుకు ఆవలింత మొదలవుతుంది. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • నిద్ర ముంచుకు వస్తుందని తెలుపడమే కాదు.. అలసిపోయిన శరీరాన్ని రీఫ్రెష్‌ చేసేందుకు కూడా ఆవలింత వస్తుందట. ఈ ఆవలింతతో శరీరానికి ఉండే లేజీనెస్‌ పోతుంది.
  • బోర్‌ కొట్టినప్పుడు, నిద్ర ముంచుకు వచ్చినప్పుడు ఆవలింత వస్తుంది. బుక్స్‌ చదివేటప్పుడు చాలామంది ఆవలిస్తూ ఉంటారు. కానీ ఆసక్తికరంగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు మాత్రం ఆవలింతలు రావు. 
  • ఆవలించడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు మరింత షార్ప్‌గా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దానర్థం మెదడు తనని తాను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు..
  • సాధారణంగా అలసట చెందినప్పుడు, విసుగు చెందినప్పుడు మెదడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ సమయంలో మెదడు చల్లటి గాలిని కోరుకుంటుంది. మెదడును చల్లబరిచేందుకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఆవలింత దోహదం చేస్తుంది. ఆవలింత ద్వారా మెదడు రీఫ్రెష్‌ అవుతుంది.


logo