అహ్మదాబాద్: ఆస్ట్రేలియా టూర్‌కు నెట్ బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసి.. అద్భుతంగా రాణించిన నటరాజన్‌ను అప్పుడే గాయాలే వేధిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు నటరాజన్‌కు భుజం, మోకాలి గాయాలు అయినట్లు నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు వెల్లడించాయి. అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేమని చెప్పాయి. ప్రతి రోజూ అతని పరిస్థితిని అంచనా వేస్తున్నామని ఎన్సీఏ తెలిపింది. మంచి ఫామ్‌లో ఉన్న నటరాజన్ మిస్ కావడం టీమిండియాకు దెబ్బే అని చెప్పాలి. మరోవైపు ఈ సిరీస్‌కు ఎంపికైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఫిట్నెస్ టెస్ట్ విఫలం కావడంతో అతని స్థానంలో రాహుల్ చహర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.