శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Jan 18, 2020 , 00:27:31

టైం సరిపోవడం లేదా?

టైం సరిపోవడం లేదా?

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవితాలే. మూడో తరగతి విద్యార్థి నుంచి ముప్పై యేండ్ల కుర్రాడి వరకు పాతికేండ్ల భామ నుంచి యాభై ఏండ్ల బామ్మ వరకూ ఎవరిని అడిగినా ఒక్కటే మాట. టైం లేదు. ఉన్న టైం సరిపోవడం లేదు. 

-అడుక్కుతినే వాడి నుంచి అంబానీ వరకూ ఉన్నది 24 గంటలే. ఎన్ని కోట్లు వెచ్చించినా కాలాన్ని ఎవరూ కొనుక్కోలేరు. మరి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. అందుకు మార్గాలేమిటి? అసలు సమయం ఎక్కడ దాక్కుంటున్నది. వెలికి తీయండి.
-ఈ ప్రశ్నకు సమాధానం కేవలం సమయంపై అదుపులేకపోవడమే.. సీరియస్‌గా ఆలోచిస్తే.. చాలా సింపుల్‌ మార్గాలు ఉన్నాయి. ఏవేం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ ఒక పట్టికలా తయారు చేసుకోవాలి. అది ఎలాంటి పనైనా సరే.. ఉదాహరణకు పిల్లల పరీక్షలు, సెలవులు, పండుగలు, పుట్టినరోజులు, పెండ్లిరోజులు ఇలా ప్రతిదీ ఆ క్యాలెండర్‌లో నమోదు చేసుకోవాలి.
-వ్యక్తిగతంగా కాకుండా వృత్తిపరమైన క్యాలెండర్‌ను కూడా తయారు చేసుకోవాలి. ప్రతి విషయాన్ని క్యాలెండర్‌లో నమోదు చేసుకోవాలి. ప్రతి నెలా వీటిని చెక్‌ చేసుకుంటూ ఉండాలి. 24 గంటల సమయాన్ని గంటలు చొప్పున వేసుకోవాలి. ఇలా ఓ వారం పాటు ఏవేం పనులు చేస్తున్నారో చూసుకోండి. అప్పుడు లెక్క తేలుతుంది.
-రోజులో ఎంత సమయం వృథా చేస్తున్నారు, ఎంత వినియోగించుకుంటున్నారో ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడే ఆ మిగిలిన సమయాన్ని చక్కగా ప్లాన్‌ చేసుకోండి. రోజులో మార్పును గుర్తించండి. ఈ పద్ధతిని కొంచెం సీరియస్‌గా అమలు చేసుకుంటే విజయం మీదే..logo