శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Jan 18, 2020 , 00:25:46

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

-నెయ్యి కాచి దించేముందు దానిలో కొన్ని మెంతులు, తమలపాకు వేస్తే సువాసనగా ఉంటుంది. దీంతోపాటు నెయ్యి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.
-పాలు విరిగిపోతాయనుకుంటే కాచేముందు అందులో కొద్దిగా వంటసోడా వేస్తే సరిపోతుంది.
-క్యాబేజీ, కాలీఫ్లవర్‌ ఉడికించుకునేటప్పుడు వాసన వస్తాయి. ఆ వాసన రాకుండా ఉండాలంటే.. బ్రెడ్‌, కొద్దిగా చక్కెర వేస్తే వాసన రాదు.
-ఒక్కోసారి కూరల్లో ఉప్పు ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా రెండు స్పూన్ల పాలమీగడ కలిపితే ఉప్పుదనం కాస్త తగ్గుతుంది. దాంతోపాటు టేస్ట్‌ కూడా బాగుంటుంది.
-ఇంటికి ఎక్కువమంది చుట్టాలు వచ్చినప్పుడు మజ్జిగ సరిపోదు. అప్పుడు గోరువెచ్చని పాలలో చిటికెడు ఉప్పువేసి నిమ్మరసం పిండితే మజ్జిగలా తయారవుతుంది.


logo