గురువారం 04 జూన్ 2020
Zindagi - Jan 16, 2020 , 23:10:32

బుజ్జి బంగారాలకు...

బుజ్జి బంగారాలకు...

బుడి బుడి అడుగులతో.. ముద్దుముద్దు మాటలతో.. బుజ్జి పాపాయి నట్టింట్లో నడయాడుతుంటే.. చూడముచ్చటగా ఉంటుంది కదా! వారి సుకుమారమైన చర్మానికి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా.. పట్టు లంగా జాకెట్లు కుట్టి తెచ్చాం.. మీ బుజ్జి బంగారాలకు ఇవి ఎలా ఉంటాయో ఓ లుక్కేయండి..


  1. ఆరెంజ్‌ కలర్‌ కంచి పట్టు లంగా ఇది. దీనికి పెద్ద అంచు వచ్చింది. దీని మీద జర్దోసీ, స్టోన్స్‌తో సింపుల్‌ బార్డర్‌ ఇచ్చాం. ఇక ఆకుపచ్చని రాసిల్క్‌ బ్లౌజ్‌ మీద అక్కడక్కడా చిన్న బుటీస్‌ ఇచ్చాం. కింది వైపు మాత్రం కట్‌ వర్క్‌లా జర్దోసీ, సీక్వెన్స్‌, థ్రెడ్‌ వర్క్‌తో హెవీగా నింపేశాం. నెక్‌ లైన్‌ దగ్గర అయితే పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఇలా కింద డిజైన్‌ చేసేసరికి రిచ్‌ లుక్‌ కూడా వచ్చింది.

2. సుతి మెత్తని బట్టలయితే పిల్లలకు ఏ ఇబ్బందీ ఉండదు. ఇక్కత్‌ రాసిల్క్‌ మెటీరియల్‌ని లంగాలా కుట్టాం. దీనికి కంచి పట్టు బార్డర్‌ని అటాచ్‌ చేశాం. ఎర్రని కంచి పట్టు ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ని బ్లౌజ్‌గా ఎంచుకున్నాం. దీని మీద గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ చేయించాం. బుగ్గ చేతులు, కింద వచ్చిన కుచ్చులు జాకెట్‌ అందాన్ని రెట్టింపు చేశాయి. 


3. ఆకు పచ్చని రాసిల్క్‌ ఇక్కత్‌ డిజైన్‌ ఫ్యాబ్రిక్‌ని లెహంగాగా ఎంచుకున్నాం. దీనికి ఎరుపు రంగు కంచి బార్డర్‌ని జత చేశాం. ఎరుపు రంగు సెల్ఫ్‌ వీవింగ్‌ వచ్చిన కంచి మెటీరియల్‌నే బ్లౌజ్‌గా ఎంచుకున్నాం. నెక్‌లైన్‌, కింది వైపు ఆకుపచ్చని రాసిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో పైపింగ్‌ చేశాం. కుచ్చులతో వచ్చిన స్లీవ్స్‌ చూడముచ్చటగా కనిపిస్తాయి. 


4. పింక్‌ కలర్‌ ప్యూర్‌ బెనారస్‌ లెహంగా ఇది. దీనికి ఆకుపచ్చని రాసిల్క్‌ మెటీరియల్‌ని కింది వైపు పైపింగ్‌ చేశాం. ఇదే మెటీరియల్‌ని బ్లౌజ్‌గా ఎంచుకున్నాం. ఈ బ్లౌజ్‌ మీద సీక్వెన్స్‌, జర్దోసీతో అక్కడక్కడా బుటీస్‌ ఇచ్చాం. నెక్‌లైన్‌, స్లీవ్స్‌ మీద కూడా హెవీగా వర్క్‌ చేశాం. 


  • వి. స్వాతి 
  • స్వాతి వెల్దండి డిజైన్‌ స్టూడియో 
  • బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ 
  • 8179668098


logo