20 యేండ్ల కృషికి ఫలితం


Wed,February 13, 2019 12:21 AM

ఇటీవలి కాలంలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ మహిళలను పట్టి పీడుస్తున్న రోగం. దీనికి సరైన రీతిలో చికిత్స ఇప్పటిదాకా లేదు. దీని గురించి 20 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి సక్సెస్ సాధించిందో మహిళా శాస్త్రవేత్త.
scientist
సర్వైకల్ క్యాన్సర్ ద్వారా గర్భాశయంలోని కొన్ని జీవకణాలు అసాధారణంగా పెరిగి మనిషిని నాశనం చేస్తాయి. మిగతా భాగాలకు కూడా పాకితే చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఈ క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది మహిళలు మృత్యువాత పడ్డారు. అది చూసి చలించిపోయింది డాక్టర్ ఎవా రామోన్ గాలిగోస్. ఈమె తన బృందంతో కలిసి ఇరవై యేండ్లుగా దీని మీద పరిశోధనలు సాగిస్తున్నది. డాక్టర్ ఎవా రామోన్ మెక్సికోలోని నేషనల్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌లో మహిళా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వీరి బృందం మనిషిలోని హ్యూమన్ పపిలోమీ వైరస్ (హెచ్‌పీపీ)ని తొలగించి సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించేలా పరిశోధనలు సాగించారు. ఈ వైరస్ దాదాపు 150 వైరస్‌ల సమూహం. దీంట్లో నుంచి 14 వైరస్‌లను తొలగించటం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా చూడవచ్చునంటున్నది ఎవా. వీరిచ్చే థెరపీ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫ్టెక్స్ కూడా ఉండవని చెబుతున్నది. అందర్నీ పట్టి పీడిస్తున్న క్యాన్సర్‌కు పరిష్కార మార్గాలు చూపుతున్న ఈ ఫలితం వెనుక ఇరువై యేండ్ల కృషి ఉంది అని ఎవా టీమ్ చెప్పుకొచ్చారు.

793
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles