కావలసిన పదార్థాలు :
పాలు: ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్: మూడు కప్పులు, మామిడిపండు: ఒకటి, మ్యాంగో ప్యూరీ: కప్పు, కస్టర్డ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్: ఒక టీస్పూన్, చక్కెర: ఒక కప్పు
తయారీ విధానం:
ముందుగా పావు కప్పు పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టి చక్కెర వేసి కరిగిన తర్వాత కస్టర్డ్ మిశ్రమం వేసి మరిగించాలి. కస్టర్డ్ మిశ్రమం చిక్కబడ్డాక దింపుకొని కాస్త చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్టీల్ బాక్స్‌లో పోసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి గడ్డకట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరి.. మ్యాంగో ఐస్‌క్రీమ్ రెడీ.