రొమాంటిక్ రిలేషన్షిప్ను చూపించే చాలా సినిమాల్లో అమ్మాయి, అబ్బాయి ముక్కూమొహం తెలియనివారై ఉంటారు. కానీ, నిజ జీవితంలో మాత్రం అన్యోన్యంగా ఉండే దంపతుల్లో.. స్నేహంతో మొదలైన ప్రేమ జంటలే ఎక్కువని తాజా అధ్యయనం తెలుపుతున్నది. బలమైన స్నేహంతో శ్రీకారం దిద్దుకున్న పరిచయాలు తర్వాత ప్రేమకు, పెండ్లికి దారి తీస్తే.. వాళ్లిద్దరి మధ్య అనుబంధం బలపడుతుందని తేలింది. ఈ అధ్యయనం ‘సోషల్- సైకలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్’ పత్రికలో ప్రచురితమైంది. గతంలో వచ్చిన చాలా విశ్లేషణలు రొమాంటిక్ రిలేషన్షిప్స్ అనేవి అపరిచితుల మధ్యనే ఉంటాయని నిర్ధారించాయి. తాజా అధ్యయనం మాత్రం దానికి భిన్నంగా ఉంది. దీనికోసం 1900 మంది అభిప్రాయాలను సేకరించారు. అందులో 68 శాతం మంది, తమ దాంపత్య విజయానికి పునాది స్నేహమేనని స్పష్టం చేశారు.