ఆరోగ్యకరమైన పదార్థాల జాబితాలో ‘వీట్ గ్రాస్’ మొదటి స్థానంలో ఉంది. ఇందులో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.
గోధుమ గడ్డిలోని పీచు కారణంగా మలబద్ధకం, బౌల్స్ సిండ్రోమ్, పైల్స్ సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి బాగుంటుంది. ఎ, సి, ఇ, కె, బి6 విటమిన్లతోపాటు ఖనిజాలూ ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. అవన్నీ కలిసి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తాయి.
గోధుమ గడ్డిలోని అమైనో ఆమ్లాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో క్యాలరీలు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువ. కాబట్టి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమస్యతో బాధపడేవారికి చాలా మంచిది. దీన్ని జ్యూస్ లేదా ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు.